'సమీష్టిగా పని చేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి'
NLG: స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం దేవరకొండలోని పార్టీ కార్యాలయంలో ఎల్లారెడ్డిబావికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి పలువురు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.