ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వార్షిక క్రీడా దినోత్సవం
మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వీడ్కోలు సమావేశం, వార్షిక క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ జై కిషన్ ఓజా బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు రాబోయే పరీక్షలకు సన్నద్ధమై మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.