చిరు బర్త్ డే రోజు విడుదలైన ఏకైక మూవీ ఇదే

చిరు బర్త్ డే రోజు విడుదలైన ఏకైక మూవీ ఇదే

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన మూవీల గురించి ఆసక్తికర విషయాలు వైరలవుతున్నాయి. అయితే చిరు బర్త్ డే రోజు ఒక సినిమా విడుదలైంది. అదే 'చంటబ్బాయి'. డిటెక్టివ్ కామెడీ సస్పెన్స్ జానర్‌లో దర్శకుడు జంధ్యాల ఈ మూవీని తెరకెక్కించారు. 1986 ఆగస్టు 22న ఇది విడుదల కాగా.. చిరు ఇందులో డిటెక్టివ్ ఆఫీసర్‌గా కనిపించారు. అంతేకాదు నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ మూవీలో నటించారు.