మెడికల్ కాలేజీకి బస్సును అందజేసిన కేంద్రమంత్రి

KNR: కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి సోమవారం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బస్సును అందజేశారు. విద్యార్థుల కష్టాలను తొలగించేందుకు బండి సంజయ్ కుమార్ ముందుకొచ్చి, విద్యార్థుల రవాణాకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు బస్సును అందజేశారు. ఎంపీ లాడ్స్ నిధులతో పాటు దాతల నుండి సేకరించిన నిధులతో బస్సును ఏర్పాటు చేశారు.