దేశ ప్రజలకు మోదీ లేఖ
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ బహిరంగ లేఖ రాశారు. వికసిత్ భారత్ లక్ష్యం వైపు దేశం సాగుతుందని తెలిపారు. దేశ పౌరులు తమ విధుల నిర్వహణకు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ దోహదపడాలని తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు.