ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
NRML: నర్సాపూర్ జి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం తరగతి గదులను పరిశీలించి విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులను ఇప్పటినుంచే సన్నద్ధం చేయాలని, 100% ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు