విత్తన ఆవిష్కరణలతో.. నూనె గింజల రంగం బలోపేతం
HYD: విత్తన ఆవిష్కరణల ద్వారా నూనె గింజల రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రైతు సంక్షేమ కమిషనర్ ప్రవీణ్ సింగ్ తెలిపారు. ICAR ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌లో నిర్వహించిన సమావేశంలో అధిక దిగుబడి, వాతావరణ మార్పులకు తట్టుకునే కొత్త రకాల అభివృద్ధిపై చర్చించారు. దిగుమతులపై ఆధారాన్ని తగ్గించి, రైతుల ఆదాయం పెంచడం లక్ష్యమని స్పష్టం చేశారు.