క్రికెట్ కోచింగ్‌కు ముగుస్తున్న గడువు

HYD: వేసవిలో GHMC పరిధిలో క్రికెట్ కోచింగ్ కేంద్రాలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆసక్తి గల అభ్యర్థులు తమ పేర్లను ఆన్లైన్‌లో నమోదు చేసుకోవాలని జాయింట్ సెక్రటరీ బసవరాజు వెల్లడించారు. దీనికోసం www.hycricket.org వెబ్‌సైట్‌ను సందర్శించి ఈనెల 4లోగా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.