మరో కొత్త ప్రోగ్రాం చేపట్టిన నిర్మల్ ఎస్పీ

మరో కొత్త ప్రోగ్రాం చేపట్టిన నిర్మల్ ఎస్పీ

NRML: జిల్లా ఎస్పీ జానకీ షర్మిల మంగళవారం జిల్లా పోలీసు అధికారులతో ఆన్‌లైన్‌లో సమీక్ష నిర్వహించారు. నిర్మల్ పోలీస్.. మీ పోలీస్ నినాదంతో గ్రామస్థాయిలో కమ్యూనిటీ మీడియేషన్ కార్యక్రమంపై ఆమె చర్చించారు. ప్రజల మధ్య వివాదాలను గ్రామ పెద్దల ద్వారా పరిష్కరించడం దీని లక్ష్యం. అలాగే జూన్ 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ గురించి ఎస్పీ సమీక్షించారు.