రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు

SKLM: రోడ్డు సేఫ్టీ, ట్రాఫిక్ నిబంధనలను ప్రతి వాహనదారుడు పాటించాలని మందస ఎస్సై కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని ప్రధాన రహదారి మలుపులు వద్ద ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించే రోడ్డు భద్రత నియమాలలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఎస్సై ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు.