'భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి'
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు ఆలయ ఈవో ఎల్. రమాదేవి పలు సూచనలు చేశారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, డ్యూటీ పట్ల పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని, భక్తులతో మర్యాదగా మాట్లాడాలని సూచించారు. ఆలయంలోని ఉద్యోగులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.