రాచపల్లి రైతులకు ఊరట

రాచపల్లి రైతులకు ఊరట

VSP: రాచపల్లి భూముల సాగుదారులకు ఊరట లభించింది. 737 సర్వే నంబరులో ఉన్న భూములను స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చొరవతో ఎకరాకు రూ.9 లక్షల పరిహారం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సోమవారం నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం జమ అవుతుందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రైతులు  ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి అదికారులకు అందించారు.