సీఎం రేవంత్‌తో భేటీ కానున్న నిర్మాతలు

TG: ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డిని సినీ నిర్మాతలు కలవనున్నారు. సినీ కార్మికుల సమ్మె సమస్యను పరిష్కరించినందుకు 20 మంది నిర్మాతలు సీఎంను కలిసి ధన్యవాదాలు తెలపనున్నారు. కార్మిక సంఘాలు 30% వేతనాల పెంపు కోరుతూ 18 రోజులు సమ్మె చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ చొరవతో వేతనాల అంశంపై నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య అంగీకారం కుదిరిన విషయం తెలిసిందే.