VIDEO: మహోత్సవంలో ప్రత్యేక పూజలు చేసిన ముస్లిం దంపతులు
WGL: నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాయి. సీతారాముల కల్యాణ మహోత్సవంలో ముస్లిం దంపతులు షేక్ రఫీ సాబ్, కవిత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షాలు తెలిపారు. ఈ వేడుకల్లో వారు పాల్గొనడం గ్రామంలో ఐక్యతను ప్రతిబింబించిందని గ్రామస్తులు తెలిపారు.