'ప్రభుత్వం RTC కార్మికుల సమస్యలు పరిష్కరిస్తుంది'
ADB: రాష్ట్ర ప్రభుత్వం RTC కార్మికుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తుందని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో నాయకులతో సమావేశమై మాట్లాడారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని సమ్మె విరమించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆర్టీసీ కార్మికులు కీలకమైన పాత్ర పోషించారని అన్నారు.