రంజాన్ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు

NDL: జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు సోమవారం రంజాన్ పండుగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని దర్గా మసీదులు, ఈద్గాల వద్ద పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాట్లు చేయడంతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులు దర్గా మసీదులు, ఈద్గాల వద్ద ప్రార్థనలు చేశారు.