ఫుట్ పాత్‌పై ఆక్రమణలు తొలగింపు
AKP: అనకాపల్లి పట్టణంలో ఫుట్ పాత్‌పై ఆక్రమణలను జీవీఎంసీ అధికారులు బుధవారం తొలగించారు. జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్ పర్యవేక్షణలో సిబ్బంది షాపులను కూలగొట్టారు. ఫుట్ పాత్ అక్రమణల కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందన్నారు. దీంతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు.