‘చదువులమ్మ తల్లిని చరబట్టిన భూ కబ్జాదారుల భరతం పడతాం’
SRD: పటాన్ చెరువు ప్రభుత్వ పాఠశాల భవనాన్ని నేలమట్టం చేసి, కోట్ల విలువ చేసే జిల్లా పరిషత్ ప్రభుత్వ స్థలాన్ని కాజేయాలని చూస్తున్న భూ కబ్జాదారుల భరతం పడతామని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. పూర్వ విద్యార్థులు చేస్తున్న పోరాటం న్యాయ సమ్మతమైన, ధర్మ సమ్మతమైన పోరాటమని వారికి అండగా BJP ఉంటుందన్నారు. ఆదర్శ పాఠశాల ఏర్పాటుకై కృషి చేస్తానని పేర్కొన్నారు.