రంజాన్ వేళ ప్రధానికి నిరసన సెగ

రంజాన్ వేళ ప్రధానికి నిరసన సెగ

రంజాన్ పర్వదినం వేళ ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌కి నిరసన సెగ తగిలింది. రంజాన్‌ను పురస్కరించుకుని సిడ్నీలోని అతి పెద్ద మసీదును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గాజా యుద్ధంపై ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రధానిని 'నరమేధ మద్దతుదారుడు' అంటూ కొంతమంది ముస్లింలు దూషించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు జాగ్రత్తగా ప్రధానిని మసీదు వెనక వైపు నుంచి తీసుకెళ్లారు.