గోదావరిఖనిలో తిరంగా ర్యాలీ

PDPL: ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో గోదావరిఖని రమేష్ నగర్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని దేశ సమైక్యతను చాటే విధంగా నినాదాలు చేశారు. బీజేపీ సీనియర్ నాయకులు కోమల్ల మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాలల నిర్వాహకులు మైసరావు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.