మ‌తిమ‌రుపుతో బాధ‌ప‌డుతున్న సీనియర్ న‌టి

మ‌తిమ‌రుపుతో బాధ‌ప‌డుతున్న సీనియర్ న‌టి

సీనియర్ నటి భానుప్రియ మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 'నా మాజీ భర్త ఆదర్శ్ కుషాల్ గుండెపోటుతో చనిపోవడం నన్ను తీవ్రంగా కుంగదీసింది. మెమొరీ లాస్ కారణంగా నేర్చుకున్న విషయాలు, డైలాగ్‌లు కూడా మర్చిపోతున్నా. చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా నేర్చుకున్న డ్యాన్స్‌పై ఆసక్తి తగ్గింది' అని పేర్కొన్నారు.