పలువురికి ఆదర్శంగా రైతు వెంకన్న
MHBD: ఇనుగుర్తి మండలంలోని అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన జిల్లా సేంద్రియ ఆదర్శ రైతు వెంకన్న పటేల్ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతులు కేవలం పంటల పైనే కాకుండా సాగు భూముల్లో నాటుకోళ్లు, చేపల పెంపకం చేపట్టాలని సూచించారు. దీని వలన కల్తీ లేని పోషకాహారం లభిస్తుందని తెలిపారు. గత 20 ఏళ్లుగా తాను గోఆధారిత సాగు చేస్తూ ఆరోగ్యంగా ఉన్నానని వివరించారు.