తణుకులో ప్రారంభమైన మహిళల బ్యాడ్మింటన్ టోర్నమెంట్
ELR: తణుకు చిట్టూరి సుబ్బారావు అండ్ సత్య ఉషారాణి బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో ఇంటర్ కాలేజీయేట్ మహిళల బ్యాడ్మింటన్ టోర్నమెంట్, యూనివర్సిటీ టీమ్ సెలక్షన్స్ మంగళవారం ప్రారంభం అయ్యాయి. ముందుగా ఇటీవల మృతి చెందినlఅంతర్జాతీయ క్రీడాకారుడు రెల్లి సంజీవరావుకు క్రీడాకారులు ఘనంగా నివాళులు అర్పించారు.