గురుకుల పాఠశాలలో ఎస్టీ కమిషన్ సభ్యుడు

గురుకుల పాఠశాలలో ఎస్టీ కమిషన్ సభ్యుడు

ASR: అరకు మండలం ఎండపల్లివలసలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను శనివారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరామ్ సందర్శించారు. ముందుగా కూరగాయలు నిలువ చేసే స్టాక్ రూమ్ పరిశీలించారు. కిచెన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ప్రిన్సిపల్ నాగరత్నంకు సూచించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని ఆదేశించారు.