VIDEO: నల్లవాగు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

VIDEO: నల్లవాగు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

SRD: సిర్గాపూర్ మండలం నల్లవాగు ప్రాజెక్టులో 961.11 క్యూసెక్కులు వరద కొనసాగుతోందని ప్రాజెక్టు ఏఈ శ్రీవర్ధన్ రెడ్డి ఆదివారం తెలిపారు. గత 3 రోజుల నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు వరద ప్రవాహం పోటెత్తింది. శనివారం ఒక్కరోజే మరో రెండు అడుగులు నీటిమట్టం పెరిగింది. జలాశయం పూర్తి సామర్థ్యం 1493 ఫీట్లు కాగా 1489 ఫీట్లకు నీళ్లు చేరాయన్నారు.