మైనారిటీల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

KMR: ఎల్లారెడ్డి ముస్లిం కమిటీ తరపున మైనారిటీ నేతలు శుక్రవారం ఎమ్మెల్యే మదన్ మోహన్ను కలిసి పట్టణంలోని మైనారిటీల సమస్యలపై వినతి పత్రం అందించారు. స్మశానవాటిక కాంపౌండ్ వాల్, సీసీ రోడ్ పనులు, రూమ్ నిర్మాణం, ఫంక్షన్ హాల్ పనులు, మైనారిటీ అమ్మాయిలకు ఇంటర్మీడియట్ ఉర్దూ కాలేజీ ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గయజొద్దీన్, సయ్యద్ మీర్ ఉన్నారు.