గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన కలెక్టర్

గోదావరి వరద ఉధృతిని పరిశీలించిన కలెక్టర్

BDK: గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు జిల్లా అధికార యంత్రాంగం సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ సూచించారు. భద్రాచలం వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుండడంతో బుధవారం తూరుబాక వద్ద డైవర్షన్ పాయింట్, భద్రాచలం కరకట్టపై నుండి గోదావరి నది వరద ఉధృతిని వారు పరిశీలించారు.