'బీసీసీఐకి దేశం కంటే స్వలాభమే ముఖ్యమా?'

భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లపై మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రయోజనాల కంటే బీసీసీఐకి స్వలాభమే ముఖ్యమా అని ప్రశ్నించారు. పహాల్గామ్ ఉగ్రదాడి తర్వాత కూడా పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లు ఆడటంపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, ఆసియా కప్‌లో పాక్‌తో భారత్ మ్యాచ్‌ను రద్దు చేయాలంటూ కేంద్ర క్రీడా శాఖ మంత్రికి లేఖ రాశారు.