ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు.. సర్వం సిద్ధం
HYD: TG ఓపెన్ స్కూల్ పరిధిలో ఉమ్మడి RR, HYDలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ 20 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు అధికారి పీవీ శ్రీహరి తెలిపారు. రోజుకు రెండు సెషన్లలో ఉదయం, సాయంత్రం పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు సమయానికి హాజరై హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.