నేడు కౌలాస్ నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం

నేడు కౌలాస్ నాల ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం

KMR: జుక్కల్ మండలంలోని కౌలాస్ నాల ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 457.50 మీటర్లకు చేరితే ఈ రాత్రికి గేట్లు ఎత్తివేసే అవకాశం ఉందని ప్రాజెక్టు ఏఈఈ సుకుమార్ తెలిపారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.