'రాష్ట్ర భవిష్యత్తు కేవలం KCR చేతుల్లోనే ఉంది'
JGL: రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి కేవలం KCR చేతుల్లోనే ఉందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రంలో బలహీన వర్గాలు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని కామెంట్ చేశారు.