జాగ్రత్త.. కార్యకర్తల పేర్లతో మోసాలు..!
VZM: ఇటీవల కొంతమంది వ్యక్తులు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఆర్టీఐ కార్యకర్తల పేర్లను ఉపయోగిస్తూ అమాయక ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎస్పీ దామోదర్ గురువారం తెలిపారు. అటువంటి మోసగాళ్లపై సమాచారం అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తాము గ్రామస్థాయిలో ఎలాంటి అధికారులను నియమించలేదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.