కనిగిరిలో రైతు సంబరాలు

ప్రకాశం: ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు పక్షపాతి కనిగిరి ఏఎంసీ ఛైర్మన్ యాదవ రమా శ్రీనివాస్ అన్నారు. శనివారం కనిగిరి ఏఎంసీ కార్యాలయంలో రైతు సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో రైతులకు గొడుగులు, టీ ప్లాస్కులను ఏఎంసీ ఛైర్మన్ రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు.