దాచేపల్లిలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం

PLD: దాచేపల్లి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించడం జరిగింది. ఆలయ పూజారి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, నూతన వస్త్రాలు, పూలతో అలంకరించి, మహిళలు కుంకుమ పూజలు చేశారు. అనంతరం పూజారులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.