పాల్ స్టిర్లింగ్@10000

ఐర్లాండ్ క్రికెటర్ పాల్ స్టిర్లింగ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 10000 పరుగులు(3 ఫార్మాట్లలో) చేసిన తొలి ఐరిష్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఈ ఘనతను అందుకున్నాడు. ఐర్లాండ్ తరఫున 8 టెస్ట్‌లు, 167 వన్డేలు, 150 టీ 20లు ఆడి 10 వేల రన్స్ చేశాడు. స్టిర్లింగ్ తర్వాత బల్బిర్నీ(6129), కెవిన్ (5850) ఉన్నారు.