తిరుమల శ్రీవారిని వదలని గ్యాస్ కొరత.!
TPT: పశ్చిమాసియా యుద్ధం కారణంగా తిరుమలలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఈ సందర్భంగా తిరుమల కొండపై 50కి పైగా హోటళ్లు మూతపడ్డాయి. దీంతో ఉచిత అన్నప్రసాదానికి భక్తుల క్యూ అదనంగా పెరిగింది. ప్రతిరోజూ లక్షమంది భక్తులకు అన్నదానం చేయడానికి వంట కోసం 6 టన్నుల గ్యాస్ వినియోగిస్తున్నారు. గ్యాస్ కొరతతో హోటళ్లు మూసివేయడంతో అన్నదానంపై ఒత్తిడి పెరిగింది.