జలధారతో నీటి విప్లవం: కలెక్టర్
అన్నమయ్య: మదనపల్లిలో నిర్వహించిన 'స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో భాగంగా జలధార ద్వారా నీటి సంరక్షణకు విశేష ఫలితాలు సాధించిన కలెక్టర్ నిశాంత్ కుమార్‌కు ఘన సన్మానం జరిగింది. కేవలం 6 నెలల్లో 3,082 చెరువుల అనుసంధానం, 962 చెరువుల పునరుద్ధరణ వంటి కీలక విజయాలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మోడల్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం విశేషమని పేర్కొన్నారు.