జర్నలిస్టుల అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ ఆందోళన

జర్నలిస్టుల అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ ఆందోళన

మహబూబాబాద్ జిల్లా పట్టణంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ బుధవారం ఆందోళన చేపట్టారు. జర్నలిస్టులు ప్లే కార్డులు పట్టుకొని వారు ప్రభుత్వ వ్యూహాన్ని ఖండిస్తూ నినాదాలు చేశారు. అరెస్ట్ చేయబడిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్ వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలో సీపీఎం నేతలు కూడా పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు.