ఏపీఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ
KRNL: రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు 9 నెలల పాటు శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 669 మంది APSP కానిస్టేబుల్ అభ్యర్థులు శిక్షణ పొందనున్నారు. APSP రెండో పటాలానికి 450 మంది, జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి 219 మంది అభ్యర్థులను కేటాయించారు. శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆ విభాగాధిపతి సత్య ఏసు తెలిపారు.