గాల్లో తేలుతూ భారత వ్యోమగాముల శిక్షణ
ఇస్రో(ISRO) ప్రతిష్టాత్మక మిషన్ 'గగన్‌యాన్' కోసం నలుగురు భారతీయ వ్యోమగాములు సిద్ధమవుతున్నారు. వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా తాజాగా తన జీరో గ్రావిటీ శిక్షణ ఫొటోలను పంచుకున్నారు. భూమి ఆకర్షణ నుంచి విడిపోయినప్పుడు కలిగే అద్భుత స్వేచ్ఛను ఈ శిక్షణలో తాను అనుభవించానని తెలిపారు. ఇది కేవలం శిక్షణ మాత్రమే కాదని, అంతులేని ఆశ్చర్యాలతో కూడిన విజ్ఞాన సర్వస్వమని శుక్లా పేర్కొన్నారు.