శ్రీశైల క్షేత్రానికి రికార్డు స్థాయిలో ఆదాయం
AP: నంద్యాల జిల్లాలోని శ్రీశైల క్షేత్రానికి కార్తీకమాసంలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. 33 రోజులకు రూ.7,27,26,400 నగదు, 117 గ్రా. బంగారం, 7 కిలోల వెండి, విదేశీ కరెన్సీ వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే రూ.కోటి 30 లక్షలు అధికంగా ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. కార్తీకమాసంలో హుండీ ఆదాయం ఈ స్థాయిలో రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.