'కౌశిక్ రెడ్డిపై వెంటనే కేసు నమోదు చేయాలి'
KNR: అసెంబ్లీలో దళిత ప్రజాప్రతినిధులను అవమానించడాన్ని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు కొంగరి శంకర్ మాదిగ తీవ్రంగా ఖండించారు. MLA కడియం శ్రీహరి గత ప్రభుత్వ పాలనలో ధరణి వ్యవస్థతో జరిగిన భూకబ్జాలపై మాట్లాడుతుండగా.. MLA పాడి కౌశిక్ రెడ్డి ఆయన వైపు వేలు చూపిస్తూ.. 'చంపేస్తా' అంటూ సైగ చేశారని అన్నారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డిపై వెంటనే కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.