నాలాలో గల్లంతైనవారి కోసం ముమ్మర గాలింపు

నాలాలో గల్లంతైనవారి కోసం ముమ్మర గాలింపు

TG: హైదరాబాద్‌లో నిన్న కురిసిన భారీ వర్షం విషాదాన్ని నింపింది. అసిఫాబాద్ అఫ్జల్‌సాగర్-మంగారు బస్తీలోని నాలాలో మామ, అల్లుడు కొట్టుకుపోయారు. ఈ క్రమంలో గల్లంతైనవారి కోసం హైడ్రా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఘటనాస్థలిని పరిశీలించారు. మరోవైపు ముషీరాబాద్‌లోని వినోద్‌నగర్ నాలాలో ఓ యువకుడు పడి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే.