VIDEO: ఘనంగా సామూహిక బోనాల పండుగ
JGL: శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పట్నాలు, బోనాలను పురస్కరించుకొని మల్యాల కేంద్రంలోని అంబేడ్కర్ కాలనీవాసులు ఆదివారం గ్రామ దేవత పోచమ్మ తల్లికి సామూహికంగా బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా నెత్తిన బోనమెత్తుకొని డప్పుచప్పుళ్లతో పురవీధుల గుండా పోచమ్మ తల్లి ఆలయం వరకు శోభాయాత్రగా వెళ్లారు. అనంతరం పోచమ్మ తల్లికి తాము వండిన బోనాన్ని నైవేద్యంగా సమర్పించారు.