ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్టు

PDPL: గోదావరిఖని ఫైవింక్లైన్ ఏరియా ఈద్గా సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ CI ఇంద్ర సేనారెడ్డి తెలిపారు. వారి నుంచి రూ. 1,60,000 నగదు, 3 సెల్‌ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు CI తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.