సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.2.35 కోట్లు

సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.2.35 కోట్లు

KMR: లింగంపేట మండలంలోని 33 గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.2.35 కోట్ల నిధులు మంజూరయ్యాయని అధికారులు సోమవారం వెల్లడించారు. గ్రామాల్లోని మట్టి రోడ్ల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిధులతో అంతర్గత రహదారులను ఆధునీకరించి, రాకపోకలను సులభతరం చేస్తామని పేర్కొన్నారు.