నేడు జిల్లాలో 12 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
SKLM: జిల్లాలోని ఇవాళ 12 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమదాలవలస, బూర్జ, హీరమండలం, జలుమూరు, కంచిలి, కొత్తూరు, ఎల్ ఎన్ పేట, మందస, నందిగం, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని తెలిపారు. ప్రజలందరూ జాగ్రతగా ఉండాలని తెలిపారు.