మౌనిక హత్య కేసు.. నిందితుడిపై దాడి
VSP: గాజువాకలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మౌనిక హత్య కేసులో నిందితుడు రవీంద్రపై మృతురాలి బంధువులు దాడి చేశారు. సీన్ రీ కనస్ట్రక్షన్ కోసం పోలీసులు నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకొచ్చిన సమయంలో ఈ దాడి జరిగింది. దీంతో అక్కడ కాసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు శ్రామిస్తున్నారు.