ప్రేమ పెళ్లి.. ఏడాదికే యువతి ఆత్మహత్య
TG: HYD మన్సూరాబాద్ వాంబె కాలనీలో దారుణం జరిగింది. గంగోత్రి అనే యువతి తన భర్త భాను వేధిస్తున్నాడంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ పెళ్లి చేసుకున్న భాను.. రూ.30 లక్షలు కట్నం కావాలంటూ పలుమార్లు దాడి చేశాడు. న్యూడ్ వీడియోలు బయటపెడతానంటూ బెదిరింపులకు గురిచేయడంతో గంగోత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం భాను పరారీలో ఉన్నాడు.