నిరుద్యోగ భృతిపై ప్రకటన లేకపోవడం బాధాకరం: అశోక్

నిరుద్యోగ భృతిపై ప్రకటన లేకపోవడం బాధాకరం: అశోక్

HNK: రాష్ట్ర యువత ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ భృతిపై బడ్జెట్‌లో ప్రకటన లేకపోవడం బాధాకరమని తెలంగాణ ఉద్యమకారుడు అమ్మ అశోక్ అన్నారు. బడ్జెట్‌లో జాబ్ క్యాలెండర్‌కు సంబంధించి ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్‌కు యువత తగిన గుణపాఠం చెప్తారన్నారు.